Sunday, May 19, 2024

మహిళల ఆత్మ బంధువు కెసిఆర్.. ఘనంగా థాంక్యూ కేసీఆర్ వేడుకలు..

రాష్ట్ర మహిళలందరికీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువు అని పెద్దపెల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మూడురోజుల మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో థాంక్యూ కేసీఆర్ వేడుకల్లో భాగంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా అభివృద్ధికి ముఖ్యమంత్రి పెద్దపీట వేశారని కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 10 లక్షల కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు లక్ష నూట పదహారు రూపాయలు అందించారన్నారు. కెసిఆర్ కిట్ల పథకం ద్వారా 11 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఈ కార్యక్రమం లో మహిళా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement