Thursday, May 6, 2021

భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి..

పెద్దపల్లిరూరల్‌: తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూమిలో నుంచి రోడ్డు వేసేందుకు భూమిని ఆక్రమించుకున్నారని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామగిరి మండలం సుందిల్ల గ్రామానికి చెందిన జనగామ రాజేశ్వరి కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో సర్వే నం. 438లో ఉన్న ఐదెకరాల భూమిని గత ఏడాది సింగరేణి యాజమాన్యం మట్టి పోసిందని, అడ్డుకోగా సింగరేణి అధికారులు భూములు తీసుకొని పరిహారం చెల్లిస్తామని చెప్పారని వివరించారు. ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండానే రోడ్డు నిర్మాణం జరుపుతున్న అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News