Sunday, April 28, 2024

TS: నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్

దేశంలో నేతన్నలను కడపులో పెట్టుకొని కాపాడుతుంది తెలంగాణ ప్రభుత్వమని, నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం గోదావరిఖని పట్టణంలోని 26వ డివిజన్ లో రూ.20 లక్షల నిధులతో పద్మశాలి సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య అనంతరం దేశంలో ఏ రాష్ట్రంలో నేతన్నలను పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు ఆసరా పధకం నేత భీమా అందిస్తుందన్నారు. నేత కార్మికులకు పని కల్పించాలని ఆర్థికంగా అదుకోవాలనీ, బతుకమ్మ చీరల తయారీ నేత కార్మికులకు అందించడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గం పద్మశాలి కులస్తులకు కమ్యూనిటీ భవన నిర్మాణం, మార్కండేయ దేవాలయంలో బోర్వెల్ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే వారికి రూ.20 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, బోర్వెల్ ఏర్పాటు చేయుంచడం జరిగిందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో సకల వర్గాల సంక్షేమం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కేసీఆర్ రుణం తీర్చుకోవాలనీ, సిఎం కేసీఆర్‌ ను హ్యట్రిక్ సీఎంగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, కార్పోరేటర్లు బాదె అంజలి దేవి, బాల రాజ్ కుమార్, పద్మశాలి కుల సంఘ నాయకులు ఆడప శంకర్, మండల సత్యనారాయణ, సిరిమల్ల జయరాములు, నూతి తిరుపతి, చిప్ప రాజేశం, అనుముల భద్రయ్య, అందె సదానందం, అనుముల కళావతి, తౌటం రాజేష్, కనుగంటి నారాయణ, నంబయ్య, రాజబాబు, కొండ సంపత్, సిరిమల్ల మధు, గాలి లింగయ్య, నాగలక్ష్మి, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అచ్చే వేణు, ఆడప శ్రీనివాస్, సట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement