Sunday, May 19, 2024

Karimnagar | సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ !

కరీంనగర్ (ప్రభ న్యూస్) కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తున్న పలువురు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్ వన్ ఐజిపి తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ఫోర్స్ లో పనిచేస్తున్న వంశీకృష్ణను వీణవంకకు, సిఎస్ బి లో పనిచేస్తున్న చేరాలును ఎల్ఎండికి, కరీంనగర్ త్రీ టౌన్ లో పనిచేస్తున్న రమేష్ ను రామడుగు పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఎల్ఎండిలో పనిచేస్తున్న ప్రమోద్ రెడ్డి, రామడుగులో పనిచేస్తున్న తిరుపతి, వీణవంకలో పనిచేస్తున్న ఆసీఫ్ మహమ్మద్ లను విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement