Sunday, May 5, 2024

క‌ష్టపడితే జాబ్ గ్యారంటీ : కొప్పుల..

ప్ర‌భ‌న్యూస్ : నిరుద్యోగ యువతీ యువకులు కష్టపడి చదివితే తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం లో కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న గ్రూప్ 1,2,3,4 మరియు ఎస్ఐ, కానిస్టేబుల్ పోటీల పరీక్షల శిక్షణ తరగతి కేంద్రాలను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డాక్టర్ చేతన ఐఎఎస్ లతో కలసి సందర్శించారు. ప్రభుత్వం 81 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేసిందని నిరుద్యోగులు పట్టుదలతో శిక్షణ పొందాలన్నారు. ఈసందర్భంగా గ్రూప్ 1,2,3,4 మరియు SI, కానిస్టేబుల్ పోటీల పరీక్షల శిక్షణ పొందుతున్న యువతీ యువకులను ఉద్దేశించి డాక్టర్ చేతన ఐఎఎస్ మాట్లాడుతూ తాను సామాన్య కుటుంబం నుండి వచ్చి అంచెలంచెలుగా ఐపీఎస్ అధికారి స్థాయికి ఎదిగిన వైనాన్ని వివరించారు.

కష్టపడి పట్టుదలతో సాధించలేనిది ఏమి లేదని,‌జాబ్ గ్యారంటీ అని నిశ్చయించుకుని తగు కృషి చేసిన వాల్లే పోటీ పరీక్షల్లో ఉద్యోగాలను సాధిస్తారన్నారు. శిక్షణ కేంద్రాల్లో ఐక్యంగా ఉంటే షేరింగ్ నాలెడ్జి పెరిగి విషయ పరిజ్ఞానం మెరుగుపడుతుందని తద్వారా విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు.. పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఉద్యోగ సాధన పై అభ్యర్థులకు తనదైన శైలిలో మెలుకువలు సలహాలు, సూచనలు అందించి శిక్షణ పొందుతున్న అభ్యర్థుల్లో స్ఫూర్తి నింపారు..
ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, యంపిపి చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, అదనపు కలెక్టర్ లత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యోరి రాజేష్, రైతు బంధు సమితి జిల్లా సభ్యులు సౌల్ల భీమయ్య, వైస్ యంపిపి గడ్డం మహిపాల్ రెడ్డి, మార్కెట్ వైస్ ఛైర్మన్ సునీల్, మరియు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement