Tuesday, April 30, 2024

మల్లన్న సన్నిధిని అపవిత్రం చేసిన మాజీ ఎమ్మెల్యే

  • దేవుడి చిత్రపటంపై ప్రమాణం అవివేకం
  • శుద్ధి చేసిన ఆలయ పాలకవర్గం

ఓదెల : జిల్లాలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని మాజీ ఎమ్మెల్యే విజయరమణ రావు అపవిత్రం చేశాడని మల్లన్న ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఆవరణను శుద్ధి చేసిన అనంతరం మల్లికార్జున స్వామి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిపై అసత్య ఆరోపణలుచేస్తూ రాజకీయ లబ్ధి కోసం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సైతం వాడుకోవడం సిగ్గు చేటన్నారు. దేవాలయం ముందు ప్రమాణం చేస్తా.. అని అంటూ మల్లికార్జున స్వామి చిత్రపటంపై పదే పదే ప్రమాణం చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే అవివేకానికి నిదర్శమన్నారు. వెంటనే తన చర్యలకు సిగ్గు పడుతూ మాజీ ఎమ్మెల్యే భేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం దేవుడి మీద ప్రమాణం చేయాలనడం మంచి పద్ధతి కాదని, ఏవైనా ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని కానీ ఇలా దేవుడిపై ప్రమాణాలు, ఇమానాలు చేయడం ఎంతమాత్రం సరైంది కాదని మండిపడ్డారు. రెండు సార్లు మాజీ ఎమ్మెల్యేను ఓడగొట్టి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డిని ప్రజలు ఎందుకు గెలిపించారో అర్ధం చేసుకోవాలని హితవు పలికారు. ఇక నైనా పద్ధతి మార్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయం చెర్మెన్‌ మేకల మల్లేశం యాదవ్‌, ధర్మకర్తలు మ్యాడగోని శ్రీకాంత్‌ గౌడ్‌, కనికిరెడ్డి సతీష్‌, దాసరి రాజన్న, చింతం వెంకటస్వామి, కర్రె కుమారస్వామి, ముడెత్తుల శ్రీనివాస్‌, రౌతు స్వర్ణలత జలపతి, నాయకులు చింతం మొగిలి, రాచర్ల కుమార్‌, మార్క రవి, శ్యామ్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement