Friday, April 26, 2024

పొలానికి తడి… కూలీలకు ఉపాధి : ఎమ్మెల్యే దాసరి

సాగునీరు వృధా కాకుండా ఉండేందుకు పొలానికి తడి కూలీలకు ఉపాధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో సాగునీరు వృధా కాకుండా కాలువల్లో పూడిక తీసే బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించి 2వ విడతలో ఎస్ ఆర్ ఎస్ పి కాలువల్లో పూడిక తీతలో బాగంగా జలహితం-జనహితం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ… ఎస్ఆర్ఎస్పీ కాలువలో సాగునీరు విడుదల సమయంలో పిచ్చిమొక్కలు ఇతరత్రా కారణాల వల్ల నీరు వృధా అవుతుందన్నారు. నీటి వృధా నియంత్రణకు బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, సర్పంచ్ సదయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, రైతుబంధు గ్రామ అధ్యక్షుడు రవీందర్, నూనె కిష్టయ్య, గ్రామ పాలక వర్గం, ఇండ్ల రమేష్, ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement