Thursday, May 2, 2024

జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్న దళిత బంధు : కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అంచనాలకు మించి విజయవంతమై జాతీయ స్థాయిలో ఇతర రాష్టాలకు, దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. మంగళవారం వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఐదుగురు దళిత బంధు లబ్ధిదారులు కలసి తెలంగాణలోనే మొట్టమొదటి అతిపెద్ద యూనిట్ భాగ్యలక్ష్మీ హోమ్ నీడ్, ఎలక్ట్రానిక్ ను జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ స్థానిక సంస్థల అదననపు కలెక్టర్, ట్రైనీ కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దళితులను ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి చేర్చేలా హుజురాబాద్, వాసాలమర్రి లలో పైలెట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకాన్ని ఆ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో అనుకున్న ఫలితాలను అధిగమంచి దేశవిదేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. దీనితో పథకం అమలు తీరును గురించి తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి స్టడీ నిమిత్తం మన దగ్గరకు తరచు వస్తున్నారని తెలియజేశారు. దళిత బంధు పథకం ద్వారా ఒకప్పుడు కూలీలుగా, కార్మికులుగా, డ్రైవర్లుగా పని చేసిన వారు ఇప్పడు యజమానులుగా మారారన్నారు. కనీసం ఉండానకి సరైన ఇళ్లులేక, ప్లాస్టిక్ డబ్బాలను అమ్ముతు జీవనోపాధి కొరకు రాష్ట్రాలు తిరుగుతూ బ్రతికే నీల సంతోష్ దళితబంధు పథకం ద్వారా ఇదే గ్రామంలో మరో దళితబంధు లబ్ధిదారునితో కలిసి 20లక్షలతో శ్రీరామ ఫర్నీచర్, ఇంజనీరింగ్ వర్క్స్ అనే యూనిట్ ను ప్రారంభించాడన్నారు. షాపు నిర్వహ‌ణతో కోటిరూపాయల టర్నోవర్ తో అద్బుతమైన విజయాన్ని సాధించాడని, వచ్చిన లాభంతో ఇప్పుడు స్వంతంగా కారును కొనుగోలు చేసి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.

అమెరికన్ టూరిస్టర్ అనే షాపులో సేల్స్ మెన్ గా పనిచేసి కరోనాతో ఉద్యోగం కోల్పోయి కుటుంబ నిర్వహ‌ణ భారంగా మారిన కళ్యాణ్, దళితబంధు పథకం ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరిక్ టూరిస్టర్ బ్యాగు షాపును ప్రారంభించి మంచి లాబాలను గడిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారందరిని ఆదర్శంగా తీసుకుని దళితబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బుతో అద్భుతంగా ఎదగాలని అన్నారు. అదే విధంగా తెలంగాణలోనే మొట్ట మొదటి అతిపెద్ద యూనిట్ ను ప్రారంభించిన జ్యోతి, శేశమ్మ, స్వప్న, దుర్గమ్మ, విజయలను జిల్లా కలెక్టర్ పూలమాలతో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లాలో విజయవంతం చేసిన అధికారులను అభినందించారు. అనంతరం చల్లూరు గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి, మామిడాల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తు కంటి వెలుగు శిభిరాన్ని సందర్శించారు. శిబిరంలో నిర్వహిస్తున్న కంటి పరీక్షలను, డాటా ఎంట్రి విదానాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement