Friday, May 3, 2024

గణపతి నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు… ఏసీపీ సారంగపాణి

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన నిమజ్జనోత్సవం కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. గురువారం నిమజ్జనోత్సవం నిర్వహించే మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… నిమజ్జనం కోసం భారీ క్రేన్ ఏర్పాటు చేస్తున్నామని, ఉత్సవ కమిటీలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపు జరుపుకోవాలన్నారు. డీజేలు పెట్టేందుకు అనుమతి లేదని, ఊరేగింపుపై పూర్తిస్థాయి నిఘా ఉంటుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ లు ప్రదీప్ కుమార్, అనిల్ కుమార్, ఇంద్రసేనారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement