Sunday, April 28, 2024

KRNR | యూపీఎస్సీలో ట్రినిటీ విద్యార్థికి అల్ ఇండియా 27వ ర్యాంక్

కరీంనగర్ (ప్రభ న్యూస్) : యుపిఎస్సి విడుదల చేసిన ఫలితాలలో ట్రినిటీ విద్యా కుసుమం నందాల సాయి కిరణ్ ఆల్ ఇండియా 27 వ ర్యాంకు సాధించాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ తండ్రి పవర్ లూమ్ లో పని చేస్తుండగా తల్లి బీడీ లు చుడుతూ పిల్లల్ని బాగా చదివించారు. 2012 లో సాయికిరణ్ ఎస్ఎస్సి లో ఉత్తమ మార్కులు సాధించి ట్రినిటీ కళాశాల లో సాయికిరణ్ ఇంటర్ ఎంపీసీ విద్యను అభ్యసించాడు.

ట్రినిటీ యాజమాన్యం అపార అనుభవం ఉన్న అధ్యాపక బృందంతో నాణ్యమైన విద్య అందించడంతో సాయికిరణ్ ఇంటర్ లోనూ ర్యాంకులు సాధించడంతోపాటు నీట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. అదే స్ఫూర్తి తో ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యాడు. మంగళ వారం విడుదల చేసిన ఫలితాలలో ఆల్ ఇండియా 27 వా ర్యాంక్ సాధించాడు. ఈ విషయం తెలుసుకున్న వెలిచాల గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. చదువు నేర్పించిన ట్రినిటీ కళాశాల ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి లు మాట్లాడుతూ… మా కళాశాలలో చదివిన సాయికిరణ్ యుపిఎస్సి లో ర్యాంక్ తెచ్చుకోవడం మాకు మా కళాశాల కి ఎంతో గర్వకారణమన్నారు.

సాయికిరణ్ కి అభినందనలు తెలిపారు. ట్రినిటీ కళాశాల లలో వ చదివిన విద్యార్థులు ఇంజనీర్లు గా, డాక్టర్లు గా అదేవిదంగా కేంద్రప్రభుత్వ, రాష్ట్ర ప్రభత్వ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారన్నారు. తెలుపుతూ రాబోయే రోజుల్లో ఇంకా ఎందరో సాయికిరణ్ లాంటి విద్యార్థులను తయారు చేయడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను గొప్ప స్థాయి లో స్థిర పడేలా అన్ని రకాల వసతులు కల్పించడమే మా లక్ష్యమన్నారు. చెబుతూ సాయికిరణ్ కి మరోమారు అభినందనలు కళాశాల ఆవరణలో సంబరాలు చేసుకుని పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement