Friday, December 6, 2024

KNR: మద్యం మత్తులో యువకుడిపై దాడి… చికిత్స పొందుతూ మృతి

మొన్నటికి మొన్న కరీంనగర్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి కల్పనా లాడ్జ్ సమీపంలో పర్మిట్ రూమ్ లో జరిగిన గొడవతో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన మరువకముందే తాజాగా బుధవారం రాంనగర్ లోని ఓ పర్మిట్ రూంలో జరిగిన గొడవ ఎలగందల్ మండల్ కొత్తపల్లి గ్రామానికి చెందిన చేపూరి పవన్ అనే వ్యక్తి చావుకు కారణమైంది.

మద్యం మత్తులో ఉన్నటువంటి చేపూరి పవన్ అక్కడ రాత్రి 9గంటలకు మద్యం సేవించడానికి వచ్చిన కొంతమందితో గొడవకు దిగడంతో వారు మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై పవన్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 12 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య గతంలోనే మృతి చెందినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement