Saturday, May 4, 2024

అగ్నిపథ్ ను రద్దు చేయాలి.. కాల్పులను ఖండిస్తూ సీఐటీయూ నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని, ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల మీద జరిపిన కాల్పులను ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గంజి సర్కిల్ లో నిరసన కార్యక్రమాలు చేశారు.ఈ సందరన్భంగా CITU జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ.. మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచింది. దేశ సంపదను మొత్తం ప్రైవేటైజేషన్ చేసిన మోడీ సైన్యంలోకి కాంట్రాక్ట్ సైనికులను ప్రవేశపెట్టే అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థుల మీదా కాల్పులను జరిపింది. గతంలో జరిగిన విధంగానే రిక్రూమెంట్ నిర్వహించకుండా యువకుల ప్రాణాలను తీస్తుంది. అనేక మంది యువకులను అక్రమ కేసుల్లో ఇరికించి చిత్రహింసలకు గురిచేస్తున్నది. అరెస్టు చేసిన అభ్యర్థులు వెంటనే విడుదల చేసి అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

చనిపోయిన చనిపోయిన రాకేష్ కుటుంభానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువత పై లాఠీఛార్జ్ చేసి తుపాకులతో కాల్చడం దేశంలో మోడీ పాలన ఎలా ఉందో అర్థం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గత సంవత్సరం 2021 మార్చి 5న అఖిల్ పేట లో ఆర్మీ ర్యాలీ నిర్వహించి 15 నెలలు గడుస్తున్నా వారికి ఆర్మీ రాతపూర్వక పరీక్ష నిర్వహించకపోవడం వల్ల యువత నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామిక వాదులు మేధావులు అగ్నిపథ్ ను రద్దు చేయాలని ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అద్యక్షుడు యు శ్రీనివాస్, జిల్లా ఉప అధ్యక్షుడు గిట్ల ముకుంద రెడ్డి,నాయకులు అవుల రాజయ్య,చుక్క కుమార్, పోగుల సంపత్,రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement