Monday, May 6, 2024

1075 కిలోల కల్తీ అల్లం పేస్ట్ పట్టివేత..

నాసిరకం పదార్థాలతో తయారుచేసి విక్రయిస్తున్న 1075 కిలోల కల్తీ అల్లంను ఈ రోజు (శనివారం) కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లిలో అదే గ్రామానికి చెందిన ఇస్లావత్ భూపతి నాయక్ నాసిరకం పదార్థాలతో కల్తీ అల్లం తయారు చేసి కరీంనగర్ లోని డిస్ట్రిబ్యూటర్ గంప నటరాజ్ కు సరఫరా చేస్తున్నాడనే సమాచారం మేరకు ముఖరంపురాలోని గోదాంలో తనిఖీ చేయగా అందులో అల్లం పేస్ట్ డబ్బాల నిల్వలు ఉన్నాయి. అదేవిధంగా సరఫరా చేస్తున్న ఆటోలో ఉన్న‌ అల్లం డబ్బాలను స్వాధీనం చేసుకొని వాటిని ఫుడ్ ఇన్స్పెక్టర్ కు అప్పగించారు. త‌గిన‌ చర్యల కోసం నమూనాలను ల్యాబ్ కు పంపించారు.

కల్తీ పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

కల్తీ పదార్థాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ అన్నారు. కల్తీ పదార్థాల వినియోగం ద్వారా అనారోగ్యం కలుగుతుందని తెలిపారు. కల్తీ పదార్థాలు తయారు చేయడంతో పాటు విక్రయాలు జరిపే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒకసారి పట్టుబడి మళ్లీ అదే తరహా నేరలకు పాల్పడే వారిపై పిడి యాక్ట్ ను అమలు చేస్తామని హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement