Wednesday, May 22, 2024

మట్టి రోడ్లు లేని నగరంగా కరీంనగర్.. మంత్రి గంగుల

మట్టి రోడ్డు లేని నగరంగా కరీంనగర్ కార్పొరేషన్ తీర్చిదిద్దుతామని.. ఎన్నికల్లోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మంత్రి మీసేవ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రూ.157 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. ఆగస్టు చివరి వారంలో మానేరు రివర్ ఫ్రంట్ మొదటి దశ పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ప్రజలు అబ్బురపడే విధంగా నగరంలో అభివృద్ధి కొనసాగుతుందని… ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయం చేస్తామని మిగతా సమయంలో తమ ధ్యాస అంత అభివృద్ధి పైనే అని.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం నగర అభివృద్ధి కోసం పాటుపడుతున్నామని మంత్రి అన్నారు.. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని వెల్లడించారు.

నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రానున్న రోజుల్లో మట్టి రోడ్డు లేని కరీంనగర్ కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతామని వెల్లడించారు.. కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. కార్పొరేషన్ పరిధిలో ముఖ్యమంత్రి హామీ నిధులు రూ.132 కోట్లు.. కరీంనగర్ రూరల్ లో రూ.25 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని.. ఆగస్టు 15నుండి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. పార్టీలకతీతంగా నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. శివారు కాలనీల్లోని లింకు రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.. నగరంలో ఇప్పటికే ప్రధాన చౌరస్తాలలో ఐలాండ్ లు నిర్మించామని.. మిగిలి ఉన్న ఐలాండ్ నిర్మాణ పనులు త్వరగానే పూర్తి చేస్తామని వెల్లడించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement