Wednesday, May 15, 2024

ఉద్యోగ ఖాళీలు.. త్వరలోనే నోటిఫికేషన్.. రెడీ అవుతున్న దస్త్రం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నిరుద్యోగులు ఎదురు చూస్తున్న ఉద్యోగ భర్తీకి దస్త్రం రెడీ అవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్ధిక శాఖ ఫైల్‌ను సిద్దం చేసి మంత్రివర్గ ఆమోదానికి పంపింది. దీనిపై ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తీసుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పటికే పలుదశల్లో ఖాళీల గుర్తింపును చేపట్టిన ప్రభుత్వం జిల్లాలు, శాఖల వారీగా మొత్తం ఖాళీలను గుర్తించింది. క్యాబినెట్‌ ఆమోదం తర్వాత జరిపే భర్తీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను మినహాయించి ప్రత్యక్ష నియామకాల ద్వారా ఏర్పడిన 49వేలకుపైగా నియామకాల భర్తీ దిశగా కృషి చేస్తున్నది. కాగా మంత్రివర్గ సమావేశం నిర్వహించే రోజున ఉన్న ఖాళీలను ప్రామాణికంగా తీసుకుంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. తాజాగా సీఎంఓకు చేరిన ఫైల్‌కు క్యాబినెట్‌ ఆమోదం దక్కిన వెంటనే ఖాళీలపై ప్రభుత్వం నోటిఫై చేయనుంది.

దీంతో నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌ పడనుంది. ఇప్పటికే ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు, సర్వీస్‌ రూల్స్‌, రోస్టర్‌, రిజర్వేషన్లవారీగా ఖాళీల వివరాలను, నియామక రూల్స్‌ వంటివాటిని ఆయా నియామక ఏజెన్సీలకు అందించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత నిర్దేశిత గడువులోగా నోటిఫికేషన్లు వెల్లడించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఒకదానివెంట ఒకటి 49వేలకుపైగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం ప్రకటన జారీ చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా నియామక సంస్థలైన గురుకుల నియామక, పోలీస్‌, పంచాయతీరాజ్‌, వైద్య నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఖాళీలను గుర్తించి ఆయా సంస్థలకు సమాచారం చేరవేశారు. జోనల్‌, జిల్లా, మల్టిd జోన్ల వర్గీకరణ ఇపస్పటికే పూర్తి కావడంతో మిగిలిన స్వల్ప అవాంతరాలను కూడా తొలగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement