Saturday, March 2, 2024

IT Raids – ఫార్మా కంపెనీలపై ఐటి దాడులు … మంత్రి సబిత బంధువుల ఇళ్లలో కూడా…

హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఓటింగ్‌కు 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.

మొన్నటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు ఫార్మా కంపెనీలు నిధులు ఇస్తారనే అంచనాతో ఈ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement