Monday, June 24, 2024

TS : లీడ‌ర్లుగా ఎద‌గాల‌నుకునే యువ‌త‌కు ఆయ‌నే స్పూర్తి… కేటీఆర్ ట్వీట్‌…

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. లీడర్లుగా ఎదగాలనుకునే యువతకు ఆయన స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

‘కొప్పుల ఈశ్వర్ స్టోరీ సక్సెస్ ఫుల్ లీడర్స్ గా ఎదగాలనుకునే వారికి స్ఫూర్తినిస్తుంది.. 80వ దశకం చివరలో సింగరేణి సాధారణ కార్మికుడిగా ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్మిక సంఘం ద్వారా హక్కుల పోరాటంలో పాల్గొన్నారు. 90 వ దశకం చివర్లో ప్రజాజీవితంలో చేరి 2001లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 20 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చీఫ్ విప్ గా, చివరి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అపారమైన అనుభం ఉన్న నిబద్ధత కలిగిన నాయకుడు ప్రస్తుతం పెద్దపల్లి నుంచి పార్లమెంట్ బరిలో నిలిచారు. పెద్ద పల్లి ప్రజలు ఆయనకు చాన్స్ ఇవ్వాలని ఆశిస్తున్నాను.’ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement