Wednesday, February 28, 2024

భారత్‌లో 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు

దేశంలో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 200 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్లో కోవిడ్ రోగులను కేంద్ర మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మీడయాతో మాట్లాడుతూ భారత్‌ బయోటెక్‌కు వ్యాక్సిన్‌ అడ్వాన్స్‌ కింద రూ.1500 కోట్లు కేటాయించామని వివరించారు. దేశంలో ఆక్సిజన్‌ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామని చెప్పారు. తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామని, దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు. కరోనా థర్డ్‌ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అనవసరంగా ప్రజలను భయపెట్టొద్దని కిషన్‌ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement