Thursday, April 25, 2024

అన్నమయ్య కీర్తనలు : రాముడు రాఘవుడు

రాగం : కానడ
రాముడు రాఘవుడు రవికులు డితడు
భూమిజకు పతియైన పురుష నిధానము || ||రాముడు రాఘవుడు||

అరయ పుత్రకామేష్టియందు పరమాన్నమున
పరగ జనించిన పరబ్రహ్మము
సురల రక్షింపగ అసురల శిక్షింపగ
తిరమై ఉదయించిన దివ్యతేజము || ||రాముడు రాఘవుడు||

చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో
సంతతము నిలిచిన సాకారము
వింతులగా మునులెల్ల వెదకిన యట్టి
కాంతుల చెన్ను మీరిన కైవల్యపదము || ||రాముడు రాఘవుడు||

వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు
పొదుకొన పలికేటి పరమార్ధము
పోదితో శ్రీ వేంకటాద్రి పొంచి విజనగరాన
ఆదికి అనాదియైన అర్చావతారము || ||రాముడు రాఘవుడు||

Advertisement

తాజా వార్తలు

Advertisement