Sunday, April 14, 2024

సౌతాంప్టన్ లో భారీ వర్షం

క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి‌ప్ ఫైనల్ మ్యాచ్‎కు వరుణుడు అడ్డు వచ్చేలా ఉన్నాడు. సౌతాంప్టన్‎లో ఓ మోస్తార్ నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం ఏర్పడుతోంది. వర్షం పడకపోయినా..మ్యాచ్ జరుగుతున్న సమయంలో పదేపదే చిరుజల్లులతో టెస్టు మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశం కన్పిస్తోంది.

సౌతాంప్టన్‎లో 91 శాతం వర్షం పడే చాన్స్ ఉందని వివిధ వాతావరణ సమాచార వెబ్ సైట్లు తెలుపుతున్నాయి. శుక్రవారం మొత్తం ఆకాశంలో మబ్బులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఆస్కారం ఉంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ వాతావరణశాఖ తెలిపింది. దీంతో అభిమానుల్లో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు సౌతాంప్టన్ లో వాతావరణం ఎలా ఉందో ఐసీసీ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement