Saturday, April 20, 2024

పవర్ స్టార్ పై ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నటుడు ఆసక్తికర వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఇప్పుడే కరోనా తగ్గుతుండటం తో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు యూనిట్ సభ్యులు. అయితే ఇదిలా ఉండగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రవీంద్ర విజయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంలో తాను ఓ కీలక పాత్ర చేస్తున్నానని… అలాగే పవన్ కి తన కి ఒక యాక్షన్ సీన్ కూడా ఉందని అన్నారు. అయితే యాక్షన్ సీన్ లో పవన్ తన కో ఆర్టిస్ట్ లు చిన్నవాళ్ళ అయినా పెద్దవాళ్ళు అయిన తీసుకునే కేర్ చాలా బాగుంటుందని అన్నారు. కనీసం చిన్న దెబ్బ కూడా తగలకుండా వెంట్రుక వాసి దూరంలో పవన్ యాక్షన్ సీన్స్ చేసేవారని రవీంద్ర తెలిపారు. రవీంద్ర చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ ను ఇట్టే ఆకట్టుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో దటీజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement