Tuesday, May 7, 2024

ప్రధాని సమక్షంలో పేరిణి శివ‌తాండ‌వం.. ఆక‌ట్టుకున్న ర‌త‌న్‌కుమార్ నృత్యం

తెలంగాణ‌కే ప్ర‌త్యేక‌మైన నృత్య రూప‌కం పేరిణి శివ‌తాండ‌వం. ఈ నృత్యం కాక‌తీయుల కాలం నుంచి వ‌స్తోంది. అయితే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల సందర్భంగా కరీంనగర్ జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు, కళారత్న, మాస్టార్ జరుకుల రతన్ కుమార్ కు అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాసహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతోపాటు అతిరథుల సమక్షంలో పేరిణి శివతాండవం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల మొద‌టి రోజు హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో మాస్టార్ రతన్ కుమార్ పేరిణి శివతాండవంతో అద్బుతమైన ప్రదర్శన ఇచ్చారు.

తెలంగాణకు మాత్రమే సొంతమైన ఈ పేరిణి శివతాండవం కాకతీయ రాజుల కళా స్రుష్టికి నిదర్శనం. నాడు కాకతీయులు యుద్దానికి వెళ్లే సైనికులను ప్రేరేపించడం కోసం అప్ప‌ట్లో కాకతీయ నాట్యాచార్యులు జయపసేనాని ఈ యుద్ద కళను స్రుష్టించారు. అంతరించిపోతున్న ఈ కళను నటరాజ రామక్రిష్ణ పున: ప్రతిష్ట చేశారు. ఆయన వద్ద శిష్యరికం చేసిన రతన్ కుమార్ అద్బుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. రతన్ కుమార్ శివతాండవం పూర్తయిన వెంటనే ప్రధాని మోదీసహా అక్కడున్న వాళ్లంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement