Saturday, December 7, 2024

TS: కాంగ్రెస్ ను న‌మ్మి ఓటేస్తే న‌ట్టేట మునగడమే.. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే నట్టేట మునుగుతారని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కరెంట్ లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి ఉండేదని తెలిపారు.

కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు ఉచితం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వడం లేదన్న మంత్రి జగదీశ్ రెడ్డి ఛత్తీస్ గఢ్ లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 5, 6 గంటలే కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేరని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement