Friday, June 14, 2024

TS | ICET నోటిఫికేషన్ రిలీజ్.. దరఖాస్తు, పరీక్ష తేదీలివే !

తెలంగాణలోని పీజీ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఐసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు ఐసెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 30లోగా, రూ.250 ఆలస్య రుసుముతో మే 17లోగా, రూ.500 ఆలస్య రుసుముతో మే 27లోగా దరఖాస్తులను సమర్పించవచ్చు. అభ్యర్థులకు జూన్ 4, 5 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీ తీసుకుంది.

పరీక్ష విధానం: 

మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement