Monday, April 29, 2024

జిల్లా వైద్యాధికారికి వినతి పత్రం..

మోండా : రెజిమెంటల్‌ బజార్‌లోని సలూజ నర్సింగ్‌ హోంలో కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రం ఏర్పాటుకు యాజమాన్యం అంగీకారం తెలిపిందని మాజీ కోఆప్షన్‌ సభ్యుడు నర్సింహ ముదిరాజ్‌ తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ రాజేంద్ర సలూజతో కలసి జిల్లా వైధ్యాధికారి వెంకట్ ని ఆయన కార్యాలయంలో కలసి సలూజ ఆస్పత్రిలో కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నర్సింహ ముదిరాజ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయన్న చోరవతో సలూజ నర్సింగ్‌ హోం యాజమాన్యం కేంద్రం ఏర్పాటుకు ఓ ప్రత్యేక గదిని కేటాయించేందుకు అంగీకారం తెలిపిందన్నారు. ఇదే విషయాన్ని జిల్లా వైధ్యాధికరి దృష్టికి తీసుకు వెల్లామని ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. రెజిమెంటల్‌ బజార్‌ ప్రజల సౌకర్యార్థం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టీకా కేంద్రం ఈప్రాంతంలో లేకపోవడంతో ఇక్కడి ప్రజలు టీకా కోసం కిలొమీటర్ల మేర దూర ప్రాంతాలకు వెల్లాల్సి వస్తుందన్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సలూజ నర్సింగ్‌హోం యాజమాన్యం అడిగిన వెంటనే గదిని కేటాయించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement