Sunday, April 28, 2024

HYD: మహనీయుడు స్వామి వివేకానంద… కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్

గోల్నాక, జనవరి12(ప్రభ న్యూస్): యువతకు స్ఫూర్తి దాత,భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. శుక్రవారం స్వామి వివేకానంద జయంతి వేడుకల సందర్భంగా గోల్నాక డీమార్ట్ వద్ద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ యువతి ,యువకులు స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ వాసు, కుమార్, మల్లికార్జున్, హరీష్, ఆర్కే బాబు, అర్జున్, కృష్ణ, సురేష్ గౌడ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement