Saturday, May 4, 2024

HYD: ఆడబిడ్డలకు అండగా ఉప్పల ఫౌండేషన్… ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైద‌రాబాద్ : ఆడ‌బిడ్డ‌ల‌కు ఉప్ప‌ల ఫౌండేష‌న్ అండ‌గా నిలుస్తుంద‌ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. బీసీ కాలనీ యాదగిరి గుట్టకి చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన లక్ష్మి- లక్ష్మి నారాయణ దంపతుల కుమార్తె భావన వివాహం వునందున స్థానికుల ద్వారా తెలుసుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉప్పల ఫౌండేషన్ ద్వారా వివాహానికి పుస్తె మట్టలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిరుపేద ఆడబిడ్డలను ఆదుకోవడం ఆనందంగా ఉందని తనకు తోచిన విధంగా సహాయం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అండ్ తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. తమకు అండగా నిలుస్తున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా కు ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, జీ. మధుసూధన్ రెడ్డి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement