Friday, April 26, 2024

టీజేఎస్ ఆవిర్భావ వేడుకలు..

అల్వాల్‌ : తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆపార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈమేరకు అల్వాల్‌ పట్టణ పరిధిలోని బాలాజీపార్కు సమీపంలో టీజేఎస్‌ మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు దయాకర్‌ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందుతూ ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికై నిరంతరం పోరాడాలని దయాకర్‌ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు రవికుమార్‌, సురేష్‌, సూరజ్‌, మల్లేశ్‌, పాషాభాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement