Saturday, May 4, 2024

Tiger : దుండిగల్ లో పులి సంచారం..

అడవుల్లో ఉండాల్సిన పులులు, చిరుతలు జనారణ్యంలోకి వస్తున్నాయి.. వచ్చి మూగజీవాలపై దాడులు చేస్తుండడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దుండిగల్ మున్సిపాలిటీ సమీపంలోని బౌరంపేట ఔటర్ రింగురోడ్డు వద్ద పులి సంచారం కలకలం సృష్టించింది. రెండున్నర నిమిషాల పాటుగా వీడియోలో పులి సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.

సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు. పులి సంచరిస్తున్న వార్తతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తాము స్వయంగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు చూసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. పులి సంచరిస్తున్నట్లుగా సీసీటీవి ఫుటేజ్ ఆనవాళ్లు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ప్రాంతానికి వెళ్లి పులి పాదముద్రల ఆనవాళ్లు సేకరించారు. పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement