Tuesday, May 7, 2024

HYD: ఆరోగ్యానికి మించిన సంప‌ద మ‌రొక‌టి లేదు… ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ : ఆరోగ్యమే మహాభాగ్యం అని, ఆరోగ్యానికి మించినటువంటి సంపద మరొకటి లేదనీ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శ్రీ సత్య సాయి ధ్యానమండలి పూజ్య బిక్షమయ్య గురూజీ చే నిర్వహించ బడుతున్నటువంటి ఉచిత అంతర్ముఖ యోగ శిక్షణా తరగతులు హైదరాబాదులో ఈనెల‌ 21 నుండి చిత్రాలే అవుట్ ఎల్బీనగర్, ఈనెల 23న‌ పద్మపాణి ఆచార్య కమ్యూనిటీ హాల్ హస్తినాపురం, ఈనెల 25న‌ లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ దిల్ సుఖ్ నగర్ నందు ప్రారంభమవుతున్నాయి. ఈ శిక్షణా తరగతుల గోడ పత్రికను ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా వారి కార్యాలయం నందు ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన భారతీయ సనాతన రుషులు అందించిన గొప్ప జీవన విధానం యోగ సాధన అన్నారు. ఈ యోగ సాధనతో మనిషి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవితాన్ని గడపవచ్చని, ప్రస్తుత తరుణంలో మానసిక ఒత్తిళ్లతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప ఔషధమని పేర్కొన్నారు. యోగ సాధన అనేది తన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజూ వ్యాయామం పూర్తయిన తర్వాత ప్రాణాయామ సాధన పద్ధతుల చేత తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుగా తెలియజేశారు. ఈ యోగ శిక్షణా తరగతులను పూర్తిగా ఉచితంగా అందజేయనున్నట్లు ప్రముఖ యోగా గురువు యోగ రత్న అవార్డు గ్రహీత ఇస్మాయిల్ గురూజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ఫౌండేషన్ లయన్ రామచంద్రరావు, తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర మల్సూర్ గౌడ్, ప్రముఖ యోగ మాస్టర్ శ్రీనివాసులు, నరేందర్ గురూజీ, పొనగాని ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు. శిక్షణలో పాల్గొనేవారు 9603256572 ను సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement