Monday, April 29, 2024

యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి : ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాల‌ని తెలంగాణ రాష్ట్ర‌ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని తెలంగాణ టూరిజం ప్రధాన కార్యాలయంలో.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయ‌న‌ చిత్రపటానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. ఆయ‌న‌ మాట్లాడుతూ… అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్పూర్తి ప్రదాత, ఆర్థిక వేత్త, న్యాయ కోవిదుడు, రాజ నీతిజ్ఞుడు..భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి.. భారతరత్న డా.బి.ఆర్. అంబేద్కర్ గారి పుట్టిన రోజున ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదామన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పటిష్ట రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఏదైతే దళితుల అభ్యుదయానికి కృషి చేశారో.. అదే తరహాలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. దళితుల అభ్యుదయానికి అహర్నిశలు కృషి చేస్తున్నార‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథ‌కాన్ని ప్రవేశ పెట్టిన ఏకైక సీఎం మన ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేన‌న్నారు. అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. టీఎస్ టీడీసీ ఎండీ డి.మనోహర్, ఓఎస్డీ సత్యనారాయణ, శాంతి, జీఎం – ఫైనాన్స్, ఉద్యోగ సంఘాల యూనియన్ నాయకులు సబ్బు రాజమౌళి, నరసింహారావు, ఆల్ హెచ్ఓడీస్, టూరిజం కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement