Thursday, May 2, 2024

సెర్చ్, అన్‌లాక్, డౌన్‌లోడ్ బటన్లు కనిపించడం వెనుక సస్పెన్స్ ఇదే..

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా చెత్త కుండీల్లో అన్‌లాక్, డౌన్‌లోడ్, సెర్చ్ అని లేబుల్‌తో ఉన్న జెయింట్ బటన్‌ల మిస్టరీ మరింత విస్తృతమవుతుండగా, స్మార్ట్ లాక్ స్క్రీన్ ప్లాట్‌ఫాం గ్లాన్స్ సోషల్ మీడియా ఛానెల్‌లలో పోస్ట్ చేసిన వీడియో ఎట్టకేలకు ఈ సస్పెన్స్ కు తెరదించింది. సోషల్ మీడియా ఛానెల్‌లలో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఈ జెయింట్ సింబాలిక్ బటన్‌లను డంప్ చేస్తున్న వ్యక్తుల ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలను గ్లాన్స్ తన స్మార్ట్ లాక్ స్క్రీన్ కోసం చూపింది. స్మార్ట్ లాక్ స్క్రీన్ కోసం వినియోగదారులు తమ ఫోన్‌లను అన్‌లాక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం, విభిన్న కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి అంతర్జాలం శోధించడం అవసరం లేదు. మీ గ్లాన్స్ స్మార్ట్ లాక్ స్క్రీన్‌లో తాజా ట్రెండ్‌ల నుండి స్పోర్ట్స్ అప్‌డేట్‌ల వరకు, 500కు పైగా గేమ్‌ల నుండి ఫ్యాషన్ కోసం షాపింగ్ చేయడం వరకు మీరు ఇష్టపడే ప్రతిదాన్ని పొందండి. అన్‌లాక్, సెర్చ్ లేదా డౌన్‌లోడ్ చేయవలసిన అవసరం లేదు. యాష్‌ జస్ట్ గ్లాన్స్.ఈజ్న్ట్ సింప్లీ స్మార్ట్ (యాష్‌ కేవలం గ్లాన్స్, ఇది చాలా స్మార్ట్ కాదా ? ) అని బెంగళూరుకు చెందిన యునికార్న్ స్టార్టప్ కంపెనీ వీడియోతో పాటు ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొంది.

మొదటి సారిగా చూడగానే, నగరం అంతటా చెల్లాచెదురుగా ఉన్న ఆ భారీ బటన్లు త‌నకు చాలా ఆసక్తిని కలిగించాయి. కానీ గ్లాన్స్ వాటిని శోధించడం, అన్‌లాక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటి వాటి అవసరాన్ని విస్మరిస్తున్నారని నిరూపించడానికి వాటిని ఉపయోగిస్తుందని తాను తెలుసుకున్నప్పుడు, తాను వారి వినూత్న విధానంతో చేసిన గ్లాన్స్ స్క్రీన్ ప్రచారానికి పూర్తిగా ఆకర్షితుడయ్యానని పాండియన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో గ్లాన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ బికాష్ చౌదరి మాట్లాడుతూ…. మానవునికి సంతృప్తి అనేది ఎన్నడూ ఉండదు, ఎల్లప్పుడూ కూడా ఇంకా ఎక్కువ చేయాలనే దాహంతో ఉంటాడన్నారు. ఈ అన్వేషణలో మన స్మార్ట్‌ఫోన్‌లు మనకు తోడుగా ఉండేందుకు మనకు సహాయం చేయడానికి, పనులను పూర్తి చేయడానికి, కొత్త ఆలోచనలను రేకెత్తించడానికి ఉద్దేశించబడ్డాయన్నారు. కానీ ఈ వేగవంతమైన ప్రపంచంలో, సమాచారం దాడి మనపై జరుగుతూనే ఉందన్నారు. సమాచారం కోసం శోధించడం, యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం, యాప్‌ల మధ్య మారడం, ఫీడ్‌ల ద్వారా స్క్రోలింగ్ చేయడం వంటివి మనల్ని నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. గ్లాన్స్ స్మార్ట్ లాక్ స్క్రీన్‌తో తక్కువలోనే ఎక్కువ చేయవచ్చన్నారు. మనం వెదకటానికి బదులు, మనం కోరుకునే ప్రతిదీ మన లాక్ స్క్రీన్‌పైకి వస్తుందన్నారు. మనం చేయాల్సిందల్లా కేవలం గ్లాన్స్..యాష్‌ సింప్లీస్మార్ట్ అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement