Wednesday, May 15, 2024

దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న : ఎంపీ సంతోష్ కుమార్

నీళ్లు – నిధులు – నియామ‌కాల, నినాదాలు నిజ‌మయ్యాయి దేశం అబ్బుర‌ప‌డే స్థాయిలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క‌ట‌న వ‌చ్చింది ఇది కేసీఆర్ కార్య‌ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌నమ‌ని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ “నీళ్లు-నిధులు-నియమకాలు” అనే ప్రధాన మంత్రంతో ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ట్రం సాధించారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడేండ్ల కాలంలో ఇప్పటికే అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించి తద్వారా గొప్ప సంపదను సృష్టిస్తున్నారన్నారు. ఇప్పటికే ఇచ్చిన 1 లక్షకు పైగా ఉద్యోగాలు కాకుండా, ఇప్పుడు మరో 91,142 పోస్టుల నోటిఫికేషన్‌ను ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నుండి మరో బహుమతి వచ్చిందన్నారు. ఇది ఉద్యోగ నామ సంవ‌త్స‌రంగా అభివర్ణిస్తూ తెలంగాణ యువ‌త‌కు ఎంపీ సంతోష్ కుమార్ శుభాకాంక్ష‌లు తెలియజేసారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement