Saturday, May 4, 2024

నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుపై లోక్ స‌భ‌లో గళం విప్పిన ఎంపి రంజీత్ రెడ్డి..

న్యూఢిల్లీ / చేవేళ్ల : హైద‌రాబాద్‌లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్‌స‌భ‌లో ఆయ‌న ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌కు స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ అన్న అంశంపై ప్ర‌శ్న వేశారు. ఆ స‌మ‌యంలో ఎంపీ రంజిత్ మాట్లాడుతూ.. ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నా నైపుణ్యం లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది యువ‌త ఇబ్బందిప‌డుతున్న‌ట్లు తెలిపారు. ముంబై, అహ్మ‌దాబాద్‌, కాన్పూర్‌ల‌లో మాత్ర‌మే స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేంద్రాలు ఉన్నాయ‌ని, ద‌క్షిణ భార‌త్‌లోనూ ఓ కేంద్రాన్ని ఓపెన్ చేయాల‌ని అంటూ ఆ కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఆ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వ కల్పించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ శాఖ మంత్రి మ‌హేంద్ర‌నాథ్ పాండే మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల అభ్య‌ర్థ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement