Monday, May 6, 2024

జూబ్లీహిల్స్ ప‌బ్ కేసు… క‌స్ట‌డీ రిపోర్టులో సంచ‌ల‌న విష‌యాలు

హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ పబ్ కేసులో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప్రధాన నిందితుడైన‌ సాదుద్దీన్‌ పోలీస్‌ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో శాస్త్రీపురం కార్పొరేటర్‌ కుమారుడు అసలు సూత్రధారి అని సాదుద్దీన్‌ పోలీసులకు వివరించాడు. కార్పొరేటర్‌ కుమారుడు, ఎమ్మెల్యే కొడుకు పబ్‌లోకి ఎంటర్‌ కాగానే అమ్మాయిలను వెతకడం ప్రారంభించారని, పబ్‌లోనూ మైనర్‌ అమ్మాయిలను వేధించినట్లు పేర్కొన్నాడు. పబ్‌ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కొడుకు, కార్పొరేటర్‌ కొడుకు మైనర్‌ వెంట పడ్డారు. తాను వారిని వద్దని వారించాను. దీంతో నన్ను బెంజ్ కారులో ఎక్కొద్దని ఎమ్మెల్యే కొడుకు ఆదేశించాడు.

త‌న‌ను పబ్‌ దగ్గర వదిలి అమ్మాయిని బెంజ్‌ కారులో ఎక్కించుకున్నాడు. నేను బెంజ్‌ కారులో కాకుండా ఇన్నోవాలో బేకరికి వెళ్లాను. బెంజ్ కారులోకి ఎక్కగానే మైనర్ అమ్మాయిని ఎమ్మెల్యే కుమారుడు వేధించడం ప్రారంభించాడు. మార్గమధ్యలో ఇద్దరు, మరొక ముగ్గురు పెద్దమ్మతల్లి ఆలయం పక్కన ఖాళీ స్థలంలో అఘాయిత్యానికి ఒడిగట్టారు. త‌న ఫ్రెండ్స్‌ బలవంతం కారణంగానే తానూ ఈ అత్యాచారం చేయాల్సి వచ్చింది. వారి ప్రోద్బ‌లంతోనే ఇదంతా జరిగిందని సాదుద్దీన్‌ పోలీసుల ముందు తెలిపాడు. ఇదిలా ఉంటే పబ్‌ కేసులోని నిందితుల మధ్య ఘర్షణ జరిగింది. జువైనల్‌ హోంలో ఉన్న ఐదుగురు మైనర్లు ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. శాస్త్రిపురం కార్పొరేటర్‌ కుమారుడు సాదుద్దీన్‌ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. నీ వల్లే విషయం బయటకు వచ్చిందని సాదుద్దీన్‌పై మిగతా నిందితులు దాడి చేశారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement