Saturday, May 18, 2024

HYD: ఆకాష్ బైజుస్ జాతీయ టాప్ స్కోరర్ గా నిలిచిన రిషి శేఖర్ శుక్లా

హైద‌రాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జెఈఈ) మెయిన్ 2024 మొదటి సెషన్‌లో 100 పర్సంటైల్ ను హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి రిషి శేఖర్ శుక్లా సాధించినట్లు ఆకాష్‌ బైజూస్‌ సగర్వంగా వెల్లడించింది. అతను సాధించిన ఈ విజయం అతన్ని జాతీయంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టిట్యూట్‌ పరంగా అత్యధిక స్కోరర్‌గా నిలబెట్టడమే కాకుండా భారతదేశంలోని అత్యంత కఠినమైన పోటీ పరీక్షల్లో ఒకటైన జేఈఈ లో టాప్ స్కోరర్ గా నిలవటంలో అతని తిరుగులేని నిబద్ధత, విద్యా నైపుణ్యాన్ని కూడా నొక్కి చెబుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంవత్సరం ఇంజినీరింగ్ కోసం షెడ్యూల్ చేయబడిన రెండు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లలో మొదటి దాని ఫలితాలు వెల్లడించింది.

ఈసందర్భంగా రిషి శేఖర్ శుక్లా ఆకాష్ బైజూస్ కు కృతజ్ఞతలు తెలుపుతూ… అన్ని విధాలా తనకు సహాయ పడినందుకు ఆకాష్ కు ధన్యవాదములు తెలుపుతున్నట్లు తెలిపాడు. ఇన్స్టిట్యూట్ సమగ్ర కంటెంట్, కోచింగ్ లేకుండా, తక్కువ వ్యవధిలో అనేక సబ్జెక్టుల కాన్సెప్ట్ లపై పట్టు సాధించడం అసంభవన్నాడు. రిషి శేఖర్ శుక్లాను అభినందించిన ఆకాష్ బైజూస్ రీజనల్ డైరెక్టర్ ధీరజ్ మిశ్రా మాట్లాడుతూ… రిషి శేఖర్ శుక్లా ఆదర్శప్రాయమైన విజయం, విద్యార్థులకు సమగ్ర కోచింగ్, వినూత్న అభ్యాస పరిష్కారాలతో సాధికారత కల్పించేందుకు, తద్వారా పోటీ పరీక్షల్లో రాణించేలా చేయడంలో ఆకాష్ బైజూస్‌ నిబద్ధతను ఉదాహరిస్తుందన్నారు. తదుపరి ప్రయత్నంతో పాటు అతని భవిష్యత్ ప్రయత్నాల్లో మరిన్ని విజయాలను సాధించాలని తాము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement