Friday, May 3, 2024

కరోనా కాలంలో గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి

ప్ర‌భ‌న్యూస్ : కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ బారిన పడకుండా గర్భీణులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. కొవిడ్‌ వ్యాధి బారిన పడిన గర్భీణీల్లో ముందస్తు డెలివరీలు, కొన్ని సందర్బాల్లో గర్భంలోనే శిశువు మృతిచెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన గర్భిణీలు నెలల నిండకుండానే బిడ్డలకు జన్మనివ్వడం, ప్రసవం కష్టతరం అయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని ఇటీవల వెలువడిన అనేక పరిశోధక కథనాలు స్పష్టం చేస్తున్నాయి.

కరోనా సోకిన గర్భిణుల్లో గుండె కొట్టుకునే రేటు, ఆక్సిజన్‌ వినియోగం పెరుగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో గర్భిణీలు రెగ్యులర్‌ చెకప్‌ల కోసం ఆసుపత్రులకు వెళ్లినపుడు మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం, జన సమూహాలకు దూరంగా ఉండడం వంటి కరోనా జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. గర్భిణీలు కొవిడ్‌ బారిన పడితే మిగతా వారికంటే ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు గైనకాలజిస్టులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement