Sunday, May 19, 2024

నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

వరద ముంపు నివారణకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎల్బినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 103 కోట్ల వ్యయంతో 9 పనులు చేపట్టుతున్న నేపథ్యంలో ఆ పనులను మే మాసం చివరి వరకు పూర్తి చేయాలన్నారు. గురువారం ఉదయం ఎల్బినగర్ శాసన సభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎస్.ఎన్.డి.పి ద్వారా చేపడుతున్న నాలా పనుల ప్రగతి పై ఎమ్మెల్యేతో కలిసి మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… ఎల్బి నగర్ లో శాసన సభ్యుని కోరిన విధంగా రెండు పనులను మార్పులు చేసి పనులను ప్రారంభించాలని సి.ఈ కిషన్ ను కోరారు. ఆ పనుల వాటర్ వర్క్స్, ట్రాన్స్ కో, ఇతరత్రా యుటిలిటీలున్న నేపథ్యంలో అలైన్ మెంట్ వెంటనే మార్పు చేసి పనులను చేపట్టాలని సూచించారు. సరూర్ నగర్ చెరువు నుండి వయా జోనల్ ఆఫీస్ మీదుగా చైతన్యపురి వరకు, సరూర్ నగర్ చెరువు నుండి వయా కోదండ రామ్ నగర్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే నాలా పనులను ముందుగా అలైన్ మెంట్ చేయగా వాటర్ వర్క్స్ యుటిలిటీ నీ తొలగించే అవకాశం లేని దృష్ట్యా అలైన్మెంట్ మార్పున‌కు స్థానిక ఎమ్మెల్యే అలైన్మెంట్ మార్పున‌కు సూచించిన నేపథ్యంలో వాటి అలైన్మెంట్ ను మార్చాలని మేయర్ అధికారులను ఆదేశించారు. సరూర్ నగర్ చెరువు నుండి వయా జోనల్ ఆఫీస్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే సాయిబాబా టెంపుల్ నుండి పనులు చేపడుతున్నారు. సరూర్ నగర్ నుండి వయా కోదండరాం నగర్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే పని తిరుమల నగర్ వయా ఠాకూర్ హరి ప్రసాద్ ప్రేమిసేస్ మీదుగా చైతన్యపురి వరకు చేపట్టే పనినీ మార్పు చేసినట్లు అధికారులు మేయర్ కు వివరించారు. ఈ సమావేశంలో ఇ.ఏన్.సి జియా ఉద్దిన్, సి.ఈ కిషన్, ఎస్.సి భాస్కర్ రెడ్డి, ఈ.ఈ కృష్ణయ్య, డిప్యూటీ ఈ.ఈ వెంకట్ కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement