Tuesday, May 7, 2024

almonds benefits : బాదం ప‌ప్పుతో ఎక్కువ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

బాదం పప్పుతో ఎక్కువ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. భారతదేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, డైస్లిపిడెమియా వంటి నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (ఎన్సీడీలు) భారం అధికంగా ఉంది. ఈ వ్యాధుల నుండి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల‌గాలంటే బాదంప‌ప్పు అవ‌స‌రం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం, సాధారణ శారీరక శ్రమలో పాల్గొనడం, ఆహారపు అలవాట్లను మెరుగుపరచడం ద్వారా ఎన్సీడీలు చాలా వరకు నివారించగలవని, నియంత్రించగలమని నిపుణులు అంగీకరిస్తున్నారు.

ఈసంద‌ర్భంగా ఎన్సీడీ వ్యాధుల గురించి ఫిట్‌నెస్ నిపుణుడు, సెలబ్రిటీ మాస్టర్ ఇన్‌స్ట్రక్టర్ యాస్మిన్ కరాచీవాలా మాట్లాడుతూ… తాను చూసే ప్రతి ముగ్గురి క్లయింట్‌ లలో ఒకరు టైప్ 2 మధుమేహం, గుండె సమస్యలు, చాలా మంది బరువు సంబంధిత సమస్యలతో వుంటున్నారన్నారు. తాను ఎల్లప్పుడూ వ్యాయామం, ప్రాముఖ్యతను నొక్కి చెబుతుండటమే కాదు, ప్రతి ఒక్కరూ రోజూ తాము ఏమి తింటున్నారో పరిశీలించుకోవాలని కూడా సిఫార్సు చేస్తున్నానన్నారు. అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలు లేదా స్నాక్స్‌ కు బదులుగా బాదం పప్పులను తీసుకోవటం, ఆరోగ్యకరమైన జీవనం వైపు మీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి మంచి మార్గమ‌న్నారు. బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఈ గింజలు మిమ్మల్ని చాలా కాలం పాటు నిండుగా ఉంచడమే కాకుండా, శక్తిని అందిస్తాయి, రోగనిరోధక శక్తిని కూడా అందిస్తాయన్నారు.

న్యూట్రిషన్, వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ… మధుమేహాన్ని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమ‌న్నారు. శుద్ధి చేసిన పిండి పదార్థాలు, అనారోగ్య కొవ్వులు, మొత్తం కేలరీలను తగ్గించడం కూడా కీలకమ‌న్నారు. రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను నియంత్రించడంలో సహాయపడతాయి కాబట్టి బాదంపప్పు వంటి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని కూడా ఎంచుకోవచ్చన్నారు. విటమిన్ ఇ, ప్రొటీన్, డైటరీ ఫైబర్, కాల్షియం మొదలైన 15 ముఖ్యమైన పోషకాలకు మూలం కాబట్టి బాదంలోని పోషకాహార ప్రొఫైల్ వాటిని గొప్ప చిరుతిండిగా చేస్తుందన్నారు. ప్రఖ్యాత భారతీయ టెలివిజన్ అండ్ చలనచిత్ర నటి, నిషా గణేష్ మాట్లాడుతూ…ఒక టెలివిజన్ నటిగా తాను ఫిట్‌గా ఉండాలన్నారు. పోషకాహారం విషయానికి వస్తే, బాదం త‌న మిత్రుడిగా మారిందన్నారు. అవి త‌న ఫిట్‌నెస్ లక్ష్యాలు, మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే అనేక ప్రయోజనాలను అందిస్తాయన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కొన్ని బాదంపప్పులను త‌నతో సులభంగా తీసుకెళ్లగలనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement