Sunday, May 5, 2024

Breaking: హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని సమాచారం. కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, చిరుజల్లులు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వాన పడుతున్నట్టు సమాచారం అందుతోంది.

హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, పెద్ద అంబర్​పేట్​ హయత్​నగర్​, వనస్థలిపురం, కూకట్‌పల్లి, హైదర్​నగర్​, మూసాపేట, అల్విన్​ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, కుషాయిగూడ, కాప్రా, ఏఎస్​రావు నగర్​, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతినగర్​లో వర్షం పడుతోంది. వాన రావడంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఆగిపోయారు. దీంతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది. గత రాత్రి కూడా పట్టణంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement