Thursday, May 2, 2024

ఔటర్‌కు మరమ్మతులు.. కొత్తరూపు తెచ్చేందుకు హెచ్‌ఎండీఏ నిర్ణయం

హైదరాబాద్‌, ప్రభన్యూస్‌ : హైదరాబాద్‌ మహానగరానికి తలమానికంగా నిలిచిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు కొత్తరూపు తీసుకు రావడానికి హైదరాబాద్‌ మెట్రొ పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్ణయించింది. హైదరా బాద్‌ మహానగరం ట్రాఫిక్‌ కష్టాలను తొలగించడానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ 158కిలోమీటర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేశారు. ఎనిమిది లైన్లతో నిర్మించిన ఈ రోడ్డుకు 19చోట్ల ఇంటర్‌ చేంజ్‌లు ఏర్పాటు చేశారు. మరో మూడు చోట్ల చేయడానికి పనులు సాగుతు న్నాయి. ఔటర్‌కు రెండు వైపులా సర్వీస్‌ రోడ్లనుకూడా ఏర్పాటు చేశారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డు అందుబాటులోకి వచ్చి ఏళ్లు గడుస్తుండటంతో కొన్నిచోట్ల రోడ్డు దెబ్బతింది. గంటకు 120కిమీల వేగం తో వెళ్లడానికి డిజైన్‌ చేసిన ఈ ఔటర్‌పై ప్రస్తుతం గంటకు 100కిమీలకు పరిమి తం చేశారు. అయితే అక్కడక్కడ ఏర్పడి న గుంతల వల్ల గంటకు 100కి.మీ వేగంతో పయనించడం కష్టంగా మారింది. ఆ వేగంతో వెళ్లే వాహనాలకు ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఔటర్‌ రోడ్డును దశలవారీగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు గాను రూ. 206కోట్ల వరకు ఖర్చవు తుందని అంచనా వేశారు.

అధునాతన మిషనరీతో మరమ్మతులు

- Advertisement -

ఇప్పటికే రూ. 60కోట్లతో నానక్‌రాంగూడ నుంచి శంషాబాద్‌ వరకు రెండు వైపులా మరమ్మతు పనులు పూర్తికాగా, రెండవ విడతలో పెద్దఅంబర్‌పేట నుంచి శామీర్‌పేట, ఘట్‌కేసర్‌, మేడ్చల్‌ మీదుగా పటాన్‌ చెరువు వరకు పనులు ప్రారంభించను న్నారు. ఔటర్‌పై రెండువైపులా తారును తొలగించి తిరిగి తారు వేయనున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా ఒకవై పు రెండు లైన్లలో రోడ్డు పనులు పూర్తిచేస్తుంటే మరో సగభాగం రహదా రిపై వాహనాల రాకపోకలు సాగుతున్నా యి. తొలగించిన తారు స్థానంలో అధు నాతన మిషనరీ ద్వారా తిరిగి తారుపోసి రోలర్‌ సహాయంతో రహదారి నిర్మాణం చేస్తున్నారు.

ఇటీవల కురుస్తున్న భారీవర్షాలతో రింగ్‌రోడ్డుపై గుంతలు పడుతుండటం, వాటిపై ఫ్యాచ్‌లువేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఫ్యాచ్‌లు వేసినా రోడ్డుపై వాహనాలు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న సమయంలో కుదుపులు వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకుకూడా అవకాశాలు ఉన్నాయని వాహనదా రులు వాపోతున్నారు. గతుకుల రోడ్డు వేగానికి కళ్లెం వేస్తుండడంతో ఔటర్‌ రింగ్‌రోడ్డును పూర్తిస్థాయిలో రూపుదిద్దాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement