Friday, April 26, 2024

హైటెక్స్‌లో అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్.. భారీ ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ నగరంలో మరో అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ప్రారంభమైంది. హైటెక్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మెగా కొవిడ్‌ టీకా కార్యక్రమం ఉదయం ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మెడికవర్‌ ఆస్పత్రి ఈ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగనుంది. ఇందుకు కోసం హైటెక్స్‌లో మొత్తం 3 హాళ్లలో 300 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒకేచోట 40 వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలనే లక్ష్యంతో ఈ డ్రైవ్‌ చేపట్టారు. డ్రైవ్‌ ప్రారంభించిన తొలిగంటలోనే 5 వేల మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వ్యాక్సిన్‌ కోసం జనాలు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement