Sunday, April 28, 2024

ద‌స‌రాకు నూతనోత్తేజం అందించే వంటకాలు చేసుకోండి…

భారతదేశ వ్యాప్తంగా శరన్న‌వ‌రాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పండుగను విభిన్న రకాలుగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలకు, తొమ్మిది రోజులు, తొమ్మిది రూపాల్లో కనిపించే అమ్మవారిని పూజించే వైభవోపేత కాలమిది. దేశంలోని ప్రాంతాలను బట్టి అమ్మవారిని దర్శించే రూపాలు కూడా విభిన్నంగా ఉండవచ్చు కానీ.. ఈ తొమ్మిది రోజులూ అపారమైన శక్తి సంతరిస్తుందని మాత్రం ప్రతి ఒక్కరూ నమ్ముతుంటారు. తెలంగాణాలో, సంస్కృతి, సంప్రదాయం, ప్రజలు, నమ్మకాలకు ప్రతీక అయిన నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత సైతం ఉంటుంది. ఈ రోజుల్లో అంటే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి విజయదశమి వరకూ తీసుకునే ఆహారం పట్ల అమిత జాగ్రత్త పడతారు.

ఈసంద‌ర్భంగా గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్ట‌ర్ మితేష్ లోహియా మాట్లాడుతూ… ఆహారం సిద్ధం చేసే తీరు, దానిని వినియోగించే విధానం కూడా విభిన్నంగా ఉంటుందన్నారు. ఎప్పుడూ తీసుకునే ఆహారం తీసుకోరని, ఆఖరకు వాడే పదార్ధాలు కూడా భిన్నంగా ఉంటాయన్నారు. సంప్రదాయ ఆహారాలైనటువంటి సత్తు, రాజ్‌గిర, షింగారా ఆట, సాబుదానా కూడా వాడతారన్నారు. దుర్గా పూజ రోజు అతిసరళమైన కిచూరి నుంచి విస్తృతశ్రేణి ఇలిష్‌ షోర్సీ (హిల్సా ఫిష్‌ కర్రీ), దోయీ మచ్‌ ఉంటాయన్నారు. విభిన్నమైన వెజిటేరియన్‌ వంటకాలు అయిన ఘుగిని (సెరల్స్‌తో చేస్తారు), అలూ పోస్తో వంటివి ఉంటాయన్నారు. రసగుల్లా లేకుండా ఏ భోజనమూ పూర్తి కాదన్నారు. పండుగ సమయాల్లో భారతదేశంలో ఆయా ప్రాంతాల సాంస్కృతిక వైభవం మరింతగా కనిపిస్తుందన్నారు. తరతరాలుగా సంప్రదాయాలను పాటించడం వీటిలో మరింత ప్రత్యేకమ‌న్నారు. ప్రతి ఒక్కరికీ ఈ దసరా సంతోషం తీసుకురావాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement