Friday, March 29, 2024

గాంధీజీ స్ఫూర్తితో ముందడుగు

గాంధీ జయంతి నాడు గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చరఖాపై నూలు వడికిన ఘటన దేశ ప్రజలను కదిలించింది. ఒడిషాలో బాగా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన ఆమెకు గాంధీజీ ఆశయాలకూ, కార్యాచరణ విధానాలకూ చదువుకునే రోజుల నుంచి ఆకర్షితురాలైనట్టు చెప్పారు. గతంలో కూడా తాను చరఖాపై నూలు వడికినప్పటి, గాంధీజీకి చెందిన సబర్మతి ఆశ్రమంలో నూలు వడకడంలో తననూ చలింపజేసిందనీ, స్వయం పోషకత్వ పరమార్థాన్ని చాటి చెప్పే ఈ కార్యక్రమం ఆనాడు ప్రతిఒక్కరిలో స్ఫూర్తిని నింపిందని ద్రౌపది ముర్ము అన్నారు. గాంధీజీ సేవాశ్రమాన్ని గతంలో చాలా మంది ప్రముఖులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారూ సందర్శించారు. ప్రతి ఒక్కరూ తమ అనుభూతు లను ఆ ఆశ్రమంలో గ్రంథస్థం చేశారు. గాంధీజీని గురిం చి, ఆయన నిర్వహించిన కార్యక్రమాల గురించి వినడమే కానీ, చూడని వారికి సబర్మతి ఆశ్రమం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. గాంధేయ వాదులకు ఆ ఆశ్ర మం ఒక పుణ్యక్షేత్రం. గతంలో ఆ ఆశ్రమాన్ని సందర్శించిన వారు వ్యక్తిగతంగా తాము పొందిన అను భూతులను పంచుకుంటూ గాంధీజీ అంటే దేవుడనే భావన తమకు ఎందుకు కలిగిందో వివరించారు. గాంధీజీ గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరుడే అయినా, తాను భగవంతుని భక్తుడినని చెప్పుకోవడానికి ఏనాడూ ప్రయత్నించ లేదు.

మానవుడే మాధవుడనీ, సమాజం లో అట్టడుగు వర్గాలలో దేవుణ్ణి చూసేందుకు తాను నిరంతరం ప్రయత్నిస్తానని ఆయన ఎన్నో సార్లు స్పష్టం చేశారు. ఆయన ఆశయానికి అనుగుణంగానే గిరిజన మహిళ రాష్ట్రపతి పదవిని అలంకరించి ఆయన సేవాశ్ర మాన్ని సందర్శించడం, చరఖాపై నూలు వడకడం అపూర్వమైన ఘట్టం. 75వ స్వాతంత్య్రోత్సవాలను ఇటీవలే జరుపుకున్న భారతీయులంతా గర్వించదగిన సంఘటన ఇది. గాంధీజీ ప్రబోధించినట్టుగానే దరిద్ర నారాయుణులను దేశం గౌరవిస్తోంది. డాక్టర్‌ అంబేద్కర్‌ పుణ్యమా అని రాజకీయ, ప్రభుత్వ పదవుల్లో వారికి ఉన్నత స్థానం కల్పిస్తోంది. అయితే, ఆర్థిక అసమానత లు మాత్రం పూర్తిగా రూపుమాసిపోలేదన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్య అందుకు నిదర్శనం. మనది పేదలతో కూడిన ధనిక దేశమంటూ ఆయన చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. గాంధీజీ మార్గంలో దేశం అడుగులేస్తోంది. ఇంకా పరిపూర్ణత సాధించలేదు. ఆర్థికంగా మన దేశం ఎదగడానికి గాంధీజీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పనికొస్తాయా అని పెదవి విరిచేవారున్నారు. కానీ, గాంధీజీ ఆశయాలను నెమ్మదిగా సాధించుకుంటూ వెళ్తున్న మన దేశం రాజకీయ స్వాతంత్య్రంతో పాటు ఆర్థిక స్వాతంత్య్రాన్ని కూడా త్వరలోనే సాధించగలదన్న ఆశ దేశ ప్రజల్లో ఉంది.

ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పద వికి ఎంపిక కావడం ద్వారా మనదేశంలో వెనకబడి న వర్గాలకు అత్యున్నతమైన పదవి పొందే హక్కు, అవకా శం ఉందని రుజువైంది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చొరవ, చిత్తశుద్ధిని దేశంలో అట్టడుగు వర్గాలు ఇప్పటికీ అభినందిస్తున్నాయి. ద్రౌపది ముర్ము అత్యు న్నత పదవిని చేపట్టి రెండు నెలలే అయింది. అయి నప్పటికీ ఆమె అందరికీ చేరువ కావడానికి ప్రయత్నిస్తు న్నారు. గత వారం విదేశాంగ శాఖలో దౌత్యాధికారులు గా శిక్షణ పూర్తి చేసుకున్నవారినుద్దేశించి చేసిన ప్రసంగం లో భారతదేశం గురించి ఆధునిక పరిస్థితులలో ముఖ్యం గా ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం నేపధ్యంలో వస్తున్న విమ ర్శలను ఎలా తిప్పికొట్టాలో హితబోధ చేశారు. భారత దేశ నాగరికత, సంస్కృతి విశి ష్టతను గుర్తు చేశారు. ఆమె ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నది తక్కువే అయినా ఒక విశాలమైన,ఉన్నత మైన దృక్పథంకోనే ఆమె దేశ ప్రథమ పౌరురాలిగా సేవలందించేందుకు కంకణం కట్టుకున్నట్టుగా ఆమె ప్రసంగాలు స్పష్టం చేస్తున్నాయి. గాంధీజీ కల ప్రకారం ఇప్పటికి ఇద్దరు దళితులు రాష్ట్ర పతులుగా వ్యవహరించి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని సమున్నతం చేశారు. అలాగే, ఒక గిరిజన మహిళ కూడా ఆ పదవిలో రాణించేందుకు లభించిన అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గాంధీ జీ ఆశ్రమంలో ఆయనకు అత్యంత ప్రీతికరమైన చరఖా పై నూలు వడికే కార్యక్రమాన్ని నిరంతర వార్తా స్రవంతు ల్లో వీక్షించిన దేశ ప్రజలు ఎంతో ఆనందించారు. అలాగే, గాంధీజీ నిర్మాణ కార్యక్రమాల్లో ముఖ్యమైనది అయిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొనేందుకు ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టా రు. పేరు మారినా దాని పరమార్థం అదే. గాంధీజీ ఆశ యాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు సమర్పించే ఘనమైన నివాళి.అది ఇప్పుడు సాకారం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement