Sunday, May 19, 2024

హైదరాబాద్‌లో తమ ఎక్స్‌క్లూజివ్‌ బ్రైడల్‌ కలెక్షన్‌ విడుదల చేసిన కీర్తిలాల్‌

నాణ్యత, నమ్మకమే పునాదులుగా తమ వినియోగదారులను ఆకట్టుకుంటున్న ప్రీమియం ఫైన్‌ డైమండ్‌, గోల్డ్‌ జ్యువెలరీ బ్రాండ్‌, కీర్తిలాల్స్‌ తమ ఎక్స్‌క్లూజివ్‌ బ్రైడల్‌ డైమండ్‌ జ్యువెలరీ కలెక్షన్‌ను హైదరాబాద్‌లోని తమ షోరూమ్‌లో విడుదల చేసింది. నటి సంచితా శెట్టి ఈ కలెక్షన్‌ ఆవిష్కరించడంతో పాటుగా ప్రదర్శించారు. ప్రత్యేక పండుగ ఆఫర్‌గా అన్ని వజ్రాభరణాలపై కేరట్‌కు 10వేల రూపాయల వరకూ తగ్గింపును అందిస్తున్నట్లు కీర్తిలాల్స్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా కీర్తిలాల్స్ బిజినెస్‌ స్ట్రాటజీ డైరెక్ట‌ర్ సూరజ్‌ శాంతకుమార్ మాట్లాడుతూ… నూతన బ్రైడల్‌ జ్యువెలరీ కలెక్షన్‌ ఆవిష్కరించడం పట్ల తాము చాలా ఆనందంగా ఉన్నామ‌న్నారు.

వినూత్నమైన డిజైన్‌తో తీర్చిదిద్దబడిన ఈ నూతన శ్రేణి ఆభరణాలను రేపటి వధువుల కోసం అత్యంత అందంగా చేతితో తీర్చిదిద్దబడటం జరిగింది. వినియోగదారుల నడుమ ఆనందం, సంతృప్తిని ఈ కలెక్షన్‌ తీసుకురానుందన్నారు. వినియోగదారులు కోరుకున్న డిజైన్లను అందించడంలో కీర్తిలాల్స్‌ ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. కస్టమైజేషన్‌ సేవలతో వినియోగదారులు తమ సొంత వ్యక్తిత్వంను తమ ఆభరణాలకు తీసుకురాగలరన్నారు. అనుభవజ్ఞులైన స్టోర్‌ అంతర్గత డిజైనర్లు, వినియోగదారుల సృజనాత్మకతను వెలికి తీయడంలో సహాయపడటంతో పాటుగా అత్యుత్తమ పరిష్కారాలను వారికి అందించడంలోనూ తోడ్పడగలరని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement