Friday, April 26, 2024

సిఎం కెసిఆర్ ‘హ‌రిత హార‌మే’ నాకు ప్రేర‌ణ – ఎంపి సంతోష్ కుమార్

ప్రతి మనిషీ మొక్కను సాదే వనమాలి కావాలి
తెలంగాణ అభివృద్ధికి లివింగ్‌ ఎన్‌సైక్లోపీడియా కేసీఆర్‌
ఆకుపచ్చ తెలంగాణే నా ధ్యేయం
తెలంగాణ గ్రీన్‌ కవర్‌ 33 శాతానికి పెంచడమే లక్ష్యం
12కోట్ల మొక్కలు నాటాం
మొక్కలు నాటినవారికి వనమాలి అవార్డులు
రాజ్యసభ ఎంపీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌ జోగినపల్లి సంతోష్‌కుమార్

హైదరాబాద్‌, : ”గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌”కు సీఎం కేసీఆర్ హరితహారమే తనకు ప్రేరణ అని ఎంపీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌ జోగినిపల్లి సంతోస్‌కుమార్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చాము. ‘కోటి వృక్షార్చన’ కార్యక్ర మానికి సంబంధించిన పోస్టర్‌ కూడా సీఎం కేసీఆర్‌ ఆవిష్క రించారు. ప్రజలు, నేతలు, అధికారులు, మంత్రులు పోటెత్తి మరీ మొక్కలు నాటి గ్రీన్‌ ఇండియా కార్యక్రమానికి స హకరించారు. ఈ కార్యక్రమం గొప్పగా విజయవంతమైంది” అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ అన్నారు. టౌమ్స్‌ నౌ ఇంగ్లీష్‌ ఛానెల్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆవిర్భావం గురించి వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ తనకు స్పూర్తి ప్రధాత అని ఈ సందర్బంగా కొనియాడారు. విశ్వానికి వృక్ష వేదాన్ని అందించాలనేదే మా లక్ష్యం అని పేర్కొన్న ఆయన ప్రతి మనిషీ మొక్కను సాదే ”వనమాలి” కావాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
రాజ్యసభ ఎంపీ, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌ కుమార్‌, మొక్కలు నాటడంలో లక్షలాదిమందికి స్ఫూర్తినందిస్తున్నారు. ఆయనది స్పూర్తిదాయకమైన, సృజ నాత్మకమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం. సీఎం కేసీఆర్‌ మానస పుత్రికగా రూపుదిద్దుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న హరితహారం స్పూర్తితో జులై 2018లో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపీ జోగినపల్లి సంతోష్‌ ప్రారం భించారు. మనిషి మనుగడకు ప్రాణం పోసే పచ్చని మొక్కను నాటి సాది మహా వృక్షాలుగా చేసే మహోన్నత లక్ష్యాన్ని తన గ్రీన్‌ ఛాలెంజ్‌ ద్వారా ప్రపంచం ముందుకు తీసుకువచ్చారాయన. యువ ఎంపీగా తన ప్రత్యేకతను ప్రపంచానికి చాటి చెప్పారు. వేద భూమి మీదనుంచి విశ్వానికి వృక్షవేదాన్ని అందించాలనే పట్టుదలను అలుపెరగ కుండా కొనసాగిస్తూ వచ్చిన పచ్చని ప్రస్థానంలో ఇప్పటికే పలు కీలక మైలురాళ్లను ఆయన అలవోకగా అధిగమించారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏడు సంవత్సరాల క్రితం #హరిత #హరం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ తనకు ప్రేరణ అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి పథాన నడిపిస్తు న్న ఒక లివింగ్‌ ఎన్‌ సైక్లోపీడియాగా ఆయన అభివర్ణించారు.
”ఆకుపచ్చ తెలంగాణ కోసం తోడ్పడాలని నేను నిర్ణయించుకున్నా. అందుకోసమే గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించా” అని చెప్పు కొచ్చారు. ”తెలంగాణలో కేంద్ర అటవీ శాఖ సర్వే ప్రకారం కేవలం 24 శాతం మాత్రమే గ్రీన్‌ కవర్‌ ఉంది. మేము దీనిని 3.6 శాతం పెంచాము. ఇప్పుడు దానిని 33 శాతానికి పెంచడమే మా లక్ష్యం” అని అన్నారు. 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కీసర అడవిని దత్తత తీసుకుని అభివృద్ధి పరుస్తున్న తీరును కళ్ళకు కట్టినట్లు వెల్లడించారు. ”నా సోదరుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సమా జానికి వినూత్నమైన, ఉపయో గకరమైన సేవచేయాలని నా నుంచి ఆయన కోరుకున్నారు. అందులో భాగంగా కీసర అడవిని దత్తత తీసుకోవాలనే ఆలోచన నాకు వచ్చింది. పర్యాటక కేంద్రమే కాకుండా కీసీర గుట్ట ప్రఖ్యాత శైవ క్షేత్రంగా ఆధ్యా త్మిక తీర్థ యాత్రలకు కేంద్రంగా భాసిల్లుతున్నది” అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ వివరించారు.
”నేను నా స్నే#హతులతో కలిసి గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ప్రారంభించానని గుర్తుచేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 12 కోట్లకు పైగా మొక్కలు నాటినం. 2018 లో ప్రారంభించిన ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ. పచ్చదనం, సమాజంలో పరిశుభ్ర వాతావరణాన్ని వ్యాప్తి చేయడానికి ఎప్పటికీ ఈ కార్యక్రమం కొనసా గుతూనే ఉంటుంది. ఇది మా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ యొక్క అతిపెద్ద విజయంగా నేను గర్విస్తున్నాను” అని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రశంసలం దుకున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ద్వారా మొక్కలు నాటే కార్యక్ర మంలో పాల్గొన్న వారందరికీ ‘వనమాలి’ అవార్డు ఇవ్వాలని నిర్ణయించామని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ తెలిపారు.
(సోర్సు: టైమ్సునౌ ఇంగ్లీషు ఛానెల్‌ ప్రత్యేక ఇంటర్వూ)

Advertisement

తాజా వార్తలు

Advertisement