Sunday, May 5, 2024

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 30శాతం పిఆర్సీ – 61 ఏళ్ల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సుపెంపు – కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 30 శాతం పీఆర్సీని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి కె సి ఆర్.. ఈ మేర‌కు ఆయ‌న శాస‌న‌స‌భ లో ఒక ప్ర‌క‌టన చేశారు.. ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మం అనంత‌రం కెసిఆర్ మాట్లాడుతూ, 30శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30 నుంచి ఇది అమల్లోకి రానుంద‌ని తెలిపారు… రాష్ర్టంలోని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 61 సంవ‌త్స‌రాల‌కు పెంచుతున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. పిఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలతో పలుమార్లు చర్చించానని,
వారి సూచ‌న‌ల‌కు అనుగుణంగా పిఆర్సీని 30 శాతంగా నిర్ణ‌యించామన్నారు.. కరోనా, ఆర్థికమాంద్యం కారణంగా ఆలస్యం పిఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో జాప్యం జరిగింద‌ని అంగీక‌రించారు.. అలాగే పెన్షనర్లు వయోపరిమితిని 75 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు కుదిస్తున్నట్టు చెప్పారు. ఇక‌ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేస్తూ, అన్ని విభాగాల ఉద్యోగుల అందరికీ పీఆర్సీ వర్తిస్తుందన్నారు. మానవీయ కోణంలో వేతనాలు పెంచామని ఆయన అన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 80 శాతం ఉద్యోగాల ప్రమోషన్ ప్రక్రియ పూర్తి అయ్యిందన్నారు. వెంటనే అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement