Tuesday, October 8, 2024

కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ ఫాం టికెట్‌ ధర రూ.20 పెంపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దసరా పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. విద్యా సంస్థలకు సెలవులు రావడం, దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రైల్వేస్టేషన్లకు వస్తుండటంతో రద్దిని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే..ఈమేరకు కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలను పెంచతూ నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధర రూ.20 పెంచుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement