Thursday, April 25, 2024

Food Fair: సాంప్రదాయ ఆహారంపై అవగాహన కార్యక్రమం.. విశాఖలో స్పెషల్​ ప్రోగ్రామ్​

విశాఖలో గిరిజన సంప్రదాయం ఉట్టిపడింది. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రంలో భాగంగా ఇవ్వాల (సోమవారం) గిరిజన సంప్రదాయాలపై అవగాహన కల్పించారు. ఐదవ రాష్ట్రీయ పోషణ్ మాహ్‌ను సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మహిళ శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది “మహిళా ఔర్ స్వస్త్య”.. “బచా ఔర్ శిక్ష” అనే థీమ్‌లపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రా యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్​డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్‌ఈ) ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ పలు కార్యక్రమాలు చేపట్టింది. గిరిజన ప్రాంతాలలో మహిళలు, పిల్లలకు సాంప్రదాయ ఆహారాలపై అవగాహన కల్పించారు. ఈ థీమ్ ఆధారంగా గిరిజన ఆహార ప్రదర్శనను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్‌ టి.శోభాశ్రీ, ఆంధ్రా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ ఎస్‌.హరినాథ్‌, విద్యాశాఖ హెచ్‌ఓడీ టి.షారన్‌ రాజు, కె.వి.ఆర్‌. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ప్రసన్న కుమారి, ఆంధ్రా యూనివర్సిటీలోని ఐఏఎస్‌ఈ, వివిధ విభాగాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. IASEకి చెందిన NSS వలంటీర్లు ధింసా నృత్యం, జానపద పాటల వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యార్థులు వివిధ రకాల గిరిజన వంటకాలను వండి ప్రదర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement