Thursday, April 25, 2024

Hyderabad: ప్రయాణికులకు అలెర్ట్‌.. నేడు ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్ష‌లు…

గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు మహత్మాగాంధీ రోడ్డులోని బాపూజీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. అనంతరం 10.30 గంటలకు గాంధీ జనరల్‌ ఆస్పత్రి ఎదుట ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ బేగంపేట్‌ సంగీత్‌ జంక్షన్‌ సికింద్రాబాద్‌ ఒలిఫెంటా వంతెన గాంధీ ఆస్పత్రి మార్గంలో, ప్యారడైజ్‌-రాణిగంజ్‌, బుద్ధభవన్‌ ప్యాట్నీ సర్కిల్‌ మార్గాలన్నీ గులాబీమయంగా మారాయి. ఉదయం 9 నుంచి 1 గంట వరకు.. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించనున్న సందర్భంగా ఆస్పత్రి పరిసరాల్లో ఉదయం 9:00ల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. సెయింట్‌ జాన్సన్‌ రోటరీ, క్లాక్‌టవర్‌ నుంచి వచ్చే వాహనాలను చిలకలగూడ ఎక్స్‌రోడ్డు నుంచి అనుమతించకుండా అక్కడ దారిమళ్లించి సంగీత్‌ ఎక్స్‌రోడ్‌ ఆలుగడ్డబావి గుండా వెళ్లేలా చేశారు. ఆలుగడ్డబావి ముషీరాబాద్‌ గుండా వచ్చే వాహనాలను చిలకలగూడ ఎక్స్‌ రోడ్డు దారిమళ్లించి సీతాఫల్‌మండి, వారాసిగూడ, విద్యానగర్‌, నల్లకుంట వెళ్లాల్సి ఉంటుంది ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను సికింద్రాబాద్‌ వైపు వెళ్లకుండా ముషీరాబాద్‌ వద్ద దారిమళ్లించి కవాడిగూడ, ఆర్‌పీరోడ్డు మార్గంలో వెళ్లేలా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement